Sunday, May 25, 2025
Homeఎడిట్ పేజిఎల్‌ఐసీ గిన్నిస్‌ రికార్డు

ఎల్‌ఐసీ గిన్నిస్‌ రికార్డు

- Advertisement -

ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా ఒక్కరోజులోనే 5,88,107 పాలసీల ద్వారా వెయ్యి కోట్ల రూపాయల ప్రీమియాన్ని 4,52,839 ఏజెంట్ల ద్వారా సేకరించి ప్రపంచ ప్రఖ్యాత గిన్నిస్‌బుక్‌లో చోటు సంపాదించింది. దీనికి సంబంధించి ఎల్‌ఐసీ చైర్మెన్‌ సిద్ధార్థ మహంతికి ధ్రువీకరణ పత్రాన్ని గిన్నిస్‌ బుక్‌ నిర్వాహకులు అందజేశారు. జనవరి 20న దేశవ్యాప్తంగా ”మాడ్‌ మిలియన్‌ డే” పేరుమీద నూతన వ్యాపారాన్ని సేకరించే లక్ష్యంతో ఏజెంట్లందరినీ పుర మాయించి ఎల్‌ఐసీ ఈ ఘనత సాధించింది. ఆ కార్యక్రమాన్ని దిగ్విజం చేసిన ఉద్యోగులు, ఏజెంట్లు, మార్కెటింగ్‌ అధికారులు సర్వదా అభినంద నీయులు. ఎల్‌ఐసీ రాబోయే రోజుల్లో ఇలాంటి మరిన్ని రికార్డులను నెలకొల్పే అవకాశముందని దీని ద్వారా ప్రస్ఫుటమవుతున్నది.
గతేడాది ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఐఆర్‌డీఏఐ) ఏజెంట్ల కమిషన్‌, తదితర మార్పులను ఏకపక్షంగా అమలు చేసింది. దీంతో సంస్థలో కొంత నిస్పృహ పూరిత వాతావరణం నెలకొంది. మరోవైపు చట్టాల్లో పెనుమార్పులు తీసుకొచ్చి విదేశీ పెట్టుబడికి అనుకూలంగా ఇన్సూరెన్స్‌ రంగాన్ని మార్చే ప్రయత్నాలను కేంద్రం ముమ్మరం చేసింది. ఇన్సూరెన్స్‌ ప్రీమి యంపై జీఎస్టీని తగ్గించడంపై తాత్సారం చేస్తున్నది. అవసరం లేకున్నా జరిపిన వాటాల ఉపసంహరణ (ఐపీఓ) కూడా ఎల్‌ఐసీకి నష్టదాయకమే. ప్రతికూల పరిస్థితులన్నింటి మధ్య ఒక్క రోజులోనే మహత్తర రికార్డును సాధించడానికి నెహ్రూ స్థాపించిన ఈ ఆధునిక దేవాల యం పట్ల ప్రజలకున్న విశ్వాసమే కారణం.ఎల్‌ఐసీలో మెజారిటీ కార్మిక సంఘమైన ఆల్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ (ఏఐఐఈఏ) ప్రతి సంవత్సరం జనవరి 19ని ఇన్సూరెన్స్‌ బిజినెస్‌ జాతీయ దినోత్సవాన్ని నిర్వ హిస్తూ నూతన వ్యాపార విస్తరణ కోసం కృషిచేస్తున్నది. చైర్మెన్‌ పిలుపు మేరకు సదరు దినోత్సవాన్ని జనవరి 20న జరపాలని సభ్యులందర్నీ పురమాయించి ఈ మహత్తర కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది.
పాలసీదారులకు గట్టి నమ్మకదారిగా ఉంటూ ప్రతిఫలాత్మక ఫలితాలను ఇవ్వడంలో ముందున్న ఎల్‌ఐసీలోకి యుకరక్తం రావాల్సిన ఆవశ్యకత ఉంది. రానున్న పదేండ్లలో పెద్ద సంఖ్యలో ఎల్‌ఐసీలో ఖాళీలు ఏర్పడబోతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు భర్తీ చేయాలి. కానీ, కేంద్రం ఈ విషయంలో సహ కరించక పోవడం దురదృష్టకరం. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియో గించుకునేందుకు, కొత్త నియామకాలను చేపట్టేందుకు, ప్రతిభావంతులైన ప్రస్తుత సిబ్బందిని మరింత కార్యోన్ముఖులను చేసేందుకు ఎల్‌ఐసీకి స్వయం ప్రతిపత్తి కల్పించడం ఎంతో అవసరం. ఇది దేశ ఆర్థిక స్వావలంబనను పరిపుష్టం చేసే అంశం.మనదేశంలో ఇన్సూరెన్స్‌ రంగంలో ఎల్‌ఐసీతో పాటు మరో 26 కంపెనీలు న్నాయి. ఎల్‌ఐసీ ఒక్కరోజులో సాధించిన ఘనతను కొన్ని కంపెనీలు ఏడాది మొత్తం పనిచేసినా సాధించట్లేదు. దీన్నిబట్టే ఎల్‌ఐసీ పట్ల ప్రజలకున్న విశ్వాసమేంటో అర్థమవుతున్నది. ప్రయివేటు కంపెనీల వ్యాపా రాల్లో యాభై శాతం తప్పుదోవలోనే జరుగుతున్నట్టు పార్లమెంట్‌ సాక్షిగా ఆర్థిక సర్వే ఎత్తిచూపింది. ఆ కంపెనీల్లో సిబ్బంది తొలగింపు నిష్పత్తి కూడా ఎక్కువే. పైగా, అవి పట్టణ ప్రాంతాలకే పరిమితం. ఎల్‌ఐసీ మాత్రం తన లక్ష్యాన్ని ఏనాడు కూడా మర్చిపోలేదు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ మంది ప్రజలకు ఇన్సూ రన్స్‌ కవరేజీ అందించే బాధ్యతను భుజాన వేేసుకున్నది. ఇలాంటి తరు ణంలో ఎల్‌ఐసీని కేంద్ర ప్రభుత్వం బలపర్చడం దేశ భవిష్యత్తుకు అవసరం.
– జి.తిరుపతయ్య

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -