నవతెలంగాణ – ముధోల్
ముధోల్ మండలంలోని ఎడ్ బిడ్ తండా లో గల గుట్టలో వెలిసిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభమై గురువారం కు రెండవ రోజుకు చేరుకుంది. రెండవ రోజున సమ్మక్క దేవత గద్దెపైకి చేరుకుంది. భక్తులు బోనాలు ఓడి బియ్యం సమర్పించారు . కోరిన కోరికెలు నెరవేరాలనివనదేవతలకు భక్తులు మొక్కులు చెల్లించారు. వనదేవతలకు భక్తులు భక్తిశ్రద్ధలతోతరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు.మొక్కిన మొక్కులు నెరవేరాలని నిలువెత్తు బంగారాన్ని(బెల్లం ) సమర్పించారు. పోతారాజుల విన్యాసాలు .పూనకం తో ఊగుతున్న శివ సత్తులు. ఎదురు కోళ్ల తో భక్తుల మొక్కులు ,నిలువెత్తు బంగారు (బెల్లం) సమర్పించారు.బైంసా మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఆనంద్ రావు పటేల్ ,డైరెక్టర్ రాంనాథ్,సర్పంచ్ ధూం నాయక్, వన నదేవతలకు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సన్మానించారు.
కొనసాగుతున్న సమ్మక్క సారలమ్మ జాతర
- Advertisement -
- Advertisement -


