నవతెలంగాణ – ఆలేరు రూరల్
జాతీయ ఉపాధి హామీ పథకం నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించడాన్ని ఖండిస్తూ ఆలేరు మండలం మందనపల్లి గ్రామంలో శుక్రవారం (జనవరి 30) సాయంత్రం 5 గంటలకు నిరసన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మినాక్షి నటరాజన్,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్,డీసీసీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య,భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు.మహాత్మా గాంధీ పేరుతో ప్రజలకు ఉపాధి కల్పించిన పథకం నుండి ఆయన పేరును తొలగించడం అనుచితమని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు.ఈ నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు,పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.
ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తొలగింపుపై నిరసన
- Advertisement -
- Advertisement -



