నవతెలంగాణ – ముధోల్
ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని ఎడ్ బిడ్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ లక్ష్మన్ అన్నారు. మండల లోని చించాల గ్రామంలో గురువారం సాయంత్రం ఖాతాదారులకు, రైతులకు,అవగాహన సదస్సు నిర్వహించారు. బ్యాంక్ సేవలు, ఆర్థిక మోసాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బ్యాంక్ ప్రతినిధులమంటూ అపరిచితుల నుంచి వచ్చే మేసేజ్‌లు, ఫోన్ కాల్స్‌కు స్పందించవద్దని సూచించారు. ఫోన్‌కు వచ్చే ఓటీపీ, డెబిట్ కార్డుల పిన్, సీవీవీ వంటి నంబర్లు ఇతరులకు చెప్పవద్దన్నారు. అలాంటి గోప్యతా వివరాలను బ్యాంకులు అడగవని గుర్తించాలన్నారు. టీజీబీ అందిస్తున్న ప్రత్యేక సేవలను,భీమా సౌకర్యం గురించి, వివరించారు. అలాగేమెజిషియన్ వెంకటేశ్వర్ రావు మెజిషియన్ ద్వారా పలు మోసాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సర్వేష్, ఉప సర్పంచ్ పీసర సాయినాథ్, గ్రామస్తులు, తదితరులు ,పాల్గొన్నారు.
ఖాతాదారులు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -



