Thursday, January 29, 2026
E-PAPER
Homeజిల్లాలుభక్తులతో కిక్కిరిసిన దుబ్బజాతర

భక్తులతో కిక్కిరిసిన దుబ్బజాతర

- Advertisement -

ఏర్పాట్లపై సందర్శకుల అసంతృప్తి
నవతెలంగాణ – మల్హర్ రావు

మేడారం మహజాతర నేపథ్యంలో మండలంలోని దుబ్బపేట గ్రామపంచాయతీ పరిధిలోని పంట పొలాల మధ్యలో వెలసిన దుబ్బజాతర గురువారం భక్తజనంతో కిక్కిరిసింది. సమ్మక్క-సారలమ్మ జాతరను తిలకించడానికి మండలంలోని చిన్నతూండ్ల, పెద్దతూండ్ల, మల్లారం, తాడిచెర్ల, గాదంపల్లి, అడ్వాలపల్లి, కిషన్ రావు పల్లి గ్రామాల నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలైన భూపాలపల్లి, మంథని పరివాహక ప్రాంతాల్లో నుంచి సందర్శకులు అమ్మవార్లను దర్షించుకొని మొక్కులు చెల్లించారు.

అమ్మవార్లు నమ్మిన భక్తులకు కొంగుబంగారమగునని ప్రగాఢ నమ్మకం. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం కోసం ప్రభుత్వం దేవాదాయశాఖ ఎండోమెంట్ ద్వారా రూ.1.30 లక్షల నిధులు మంజూరు చేసినట్లుగా సకల సౌకర్యాలు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినప్పటికీ జాతర ప్రాంగణంలో తాత్కాలిక మరుగుదొడ్లు లేక, తాగునీటి సౌకర్యాలు లేక  సందర్శకులు ఇబ్బందులు గురైనట్లుగా వాపోయారు.

అలాగే తాడిచెర్ల మానేరు పరివాహక ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు సందర్శకుల తాకిడి తగలడంతో భక్త జనం పోటెత్తారు. ఈ దుబ్బజాతరలో సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆలయ కమిటీ నిర్వాహకులు, అధిక సంఖ్యలో సందర్శకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -