-డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి
మున్సిపల్ అభ్యర్థులను గెలిపించి, కెసిఆర్ కు కానుకగా ఇవ్వాలి
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల యాదగిరిగుట్ట చుట్టూ అభివృద్ధి ఆశలు ఆవిరైపోయాయి అని డిసిసిబి మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట 12 మున్సిపాలిటీలను గెలిపించి కేసీఆర్ కు కానుకగా ఇవ్వాలని ప్రజలను కోరారు. కెసిఆర్ తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కావడం యాదగిరిగుట్ట ప్రజల అదృష్టం అన్నారు. ప్రభుత్వ ఖజానా నుండి 1200 కోట్ల పైచిలుకు రూపాయలు తెచ్చి యాదగిరిగుట్ట దేవస్థానము ను ప్రపంచమంతా అబ్బురపడే విధంగా తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేశారని అన్నారు. ఒకే రోజు దాదాపు లక్ష మంది భక్తులు దర్శనం చేసుకునే విధంగా అభివృద్ధి చేశారని అన్నారు.
ఇంతమంది భక్తులు రావడం వల్ల స్థానికంగా వ్యాపారులు లబ్ధి పొంది, అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ కానీ, 20 ఏళ్లు పాలించిన టిడిపి కానీ యాదగిరిగుట్టను ఏ ముఖ్యమంత్రి, ఎప్పుడు పట్టించుకోలేదు అన్నారు. కెసిఆర్ వల్లనే 450 మంది నిరుద్యోగులకు యాదగిరి గుట్ట పైన ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు లభించాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర సంవత్సరాలు అవుతుంది. ఇప్పటివరకు ఏక నా పైసలు ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టలేదు అని అన్నారు. కాంట్రాక్టర్లకు పాత బకాయిలు దాదాపు 250 కోట్లు ఉంటే, 20 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. వై టి డి ఏ పరిధిలో లేవట్ల చేస్తే డబ్బులు వై డి డి ఏ కు వెళ్తున్నాయని ఈ డబ్బులు వైటిడిఏ పరిధిలో మాత్రమే వాడుకోవాలని ఇది కేసీఆర్ సృష్టించిన సంపద కాదా అని అన్నారు.
ఆ నిధులతోనే ఈ రోడ్లు అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రియల్ ఎస్టేట్ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కుప్పకూలిపోయిందని, ఈ ప్రాంత ప్రజలకు చాలా నష్టం జరిగిందని అన్నారు. బసవపురం ప్రాజెక్టు కింద రాబోయే 20 సంవత్సరాల పిల్లలు ఆబ్బురపడే విధంగా బృందావన్ గార్డెన్ నిర్మించాలని కెసిఆర్ సంకల్పం ఉండేదని అన్నారు. కెసిఆర్ ప్రభుత్వం ఉండి ఉంటే యాదగిరిగుట్ట చుట్టూ టూరిజం డెవలప్ చేయడం ద్వారా ఆదాయం పెరిగేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బాహుపేట సర్పంచ్ కవిడే మహేందర్, రామాజీపేట సర్పంచ్ దేవేందర్, చొల్లేరు మాజీ సర్పంచ్ తోటకూరి బీరయ్య, గుండ్లపల్లి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.



