Thursday, January 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన

ప్రజాసంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన

- Advertisement -

-డిసిసి అధ్యక్షులు, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య 
కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, వైస్ చైర్మన్ అభ్యర్థి ముక్కెర్ల మల్లేష్
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్

ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా కాంగ్రెస్ పాలన సాగుతోందని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు  బీర్ల అయిలయ్య అన్నారు. గురువారం, యాదగిరిగుట్ట పట్టణం, మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో  బీర్ల అయిలయ్య  మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో 12 వార్డులు, ఆలేరు మున్సిపాలిటీలో 12 వార్డులలో కాంగ్రెస్–సీపీఐ పార్టీల ఆధ్వర్యంలో బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ లో సిపిఐ సిపిఎం మిత్రపక్షలతో నూటికి డెభై శాతం సర్పంచ్ సీట్లు గెలవడం జరిగింది అన్నారు.  కాంగ్రెస్ పార్టీ పాలనలో పట్టణాల అభివృద్ధి వేగంగా జరుగుతుందని, యాదగిరిగుట్టతో పాటు ఆలేరు నియోజకవర్గ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు కాదు పనులు చేస్తోంది. రైతు నుంచి మహిళ, యువత నుంచి పేదల వరకు ప్రతి వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని పాలన సాగిస్తోందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. మహిళలకు వడ్డీలేని రుణాలు, రైతులకు రైతు భరోసా, యువతకు ఉపాధి అవకాశాలు వంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో కాంగ్రెస్‌పై నమ్మకాన్ని మరింత పెంచాయని అన్నారు.

రానున్న ఎన్నికల్లో ప్రతి కార్యకర్త బూత్ స్థాయి నుంచి సమన్వయంతో పనిచేస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు ఐక్యతతో ముందుకు సాగితే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరని స్పష్టం చేశారు. ఈ రెండేళ్ల ప్రజా పాలనలో అన్ని వర్గాలు కూడా సంతృప్తిగా ఉన్నాయని అన్నారు. అభివృద్ధికి పట్టం కట్టాలని అన్నారు. గాడిదికి గడ్డి వేసి ఆవుకు పాలు పిండవద్దని కెసిఆర్ తరచూ చెప్పే సామెత  గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మున్సిపాలిటీలు అభివృద్ధి కావాలంటే తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని కోరారు. ఆరు మున్సిపాలిటీలను భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. సిపిఐ సిపిఎం సహకారంతోటి ఆరు మున్సిపాలిటీలలో గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోదా శ్రీరాములు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బందారపు బిక్షపతి గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు, మైలార్ గూడెం ఉపసర్పంచ్ బండి అశోక్ కుమార్, మండల ఓబీసీ చైర్మన్ శిఖ అరవింద్ గౌడ్, మున్సిపల్ మాజీ కోఆప్షన్ సభ్యులు పేరబోయిన పెంటయ్య, బరిగే రామచందర్, ముక్కెర్ల మల్లేష్ యాదవ్, కాటబత్తిని ఆంజనేయులు, హేమెంధర్, గుడ్ల నరేష్, సిపిఐ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పెరబోయిన మహేందర్, బంగారి, బండి జంగమ్మ, వెంకటేష్, రాములు  కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

యాదగిరిగుట్ట లో సిపిఐ మిత్రపక్షాలకు రెండు మున్సిపల్ కౌన్సిలర్ సీట్లు
యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో రెండు మున్సిపల్ కౌన్సిలర్ సీట్లను సిపిఐ పార్టీకి కేటాయించామని తెలిపారు. సిపిఎం కి ఒక కో ఆప్షన్ ఇస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 10 మున్సిపల్ కౌన్సిలర్ సీట్లలో పోటీ చేస్తుందని తెలిపారు. ఆలేరులో కూడా కో ఆప్షన్ అవసరమైతే రేపు జరిగే ఎలక్షన్స్ లో ఎక్కువ సీట్లు కేటాయిస్తామని తెలిపారు. ఆలేరులో సిపిఎం కి కూడా ఒక కోఆప్షన్ ఇస్తామని తెలిపారు. 

మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ప్రకటన 
యాదాద్రి భువనగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల అయిలయ్య యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ వైస్ చైర్మన్ అభ్యర్థి ముక్కెర్ల మల్లేష్ యాదవ్ ను ప్రకటించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -