Thursday, January 29, 2026
E-PAPER
Homeఆదిలాబాద్యువకులు క్రీడల్లో నైపుణ్యం పొందెందుకే సీఎం కప్ పోటీలు

యువకులు క్రీడల్లో నైపుణ్యం పొందెందుకే సీఎం కప్ పోటీలు

- Advertisement -

మండల విద్యాధికారి విజయ్ కుమార్
నవతెలంగాణ – కుభీర్
మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న యువకులు క్రీడల్లో నైపుణ్యం సాధించేలా ప్రతి ఒక్క యువకులు కృషి చేయాలని మండల విద్యాధికారి విజయ్ కుమార్ మండల ఎంపీడీవో సాగర్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రమైన కుబీర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  సీఎం కప్ పోటీలు ముగింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పోటీలో ఒక వారం నుంచి మండలంలో ఆయా ప్రభుత్వ పాఠశాలలో2025-26 సీఎం కప్ పోటీలు ఐదు క్లస్టర్లుగా  ఏర్పాటుచేసి నేడు మండల స్థాయి పోటీలు నిర్వహించడం జరిగింది. వాలీబాల్, కోకో, కబడ్డీ, పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మేమొంటో, సర్టిఫికెట్లను అందజేయడం జరిగింది ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో నిర్వహించే పోటీలలో కృషి చేయాలని అన్నారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. యువకులు క్రీడల్లో నైపుణ్యత సాధించేలా ప్రతి ఒక్కరు. కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ శివరాజ్ స్థానిక సర్పంచ్ సాయినాథ్ బైంసా ఆత్మ కమిటీ చెర్మన్ సిద్ధం వివేకానంద  మార్కెట్ కమిటీ చెర్మన్ కళ్యాణ్, ప్రధానోపాధ్యాయులు గంగాధర్.పీడీ క్రాంతి కుమార్ ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -