నవతెలంగాణ – ఆలేరు టౌను
బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే చట్టాలను రద్దు పరచాలని కోరుతూ.. ఆలేరు పట్టణంలో గురువారం సిపిఐ పార్టీ కార్యాలయంలో, ఏఐటిసి, రైతు, కార్మిక సంఘాల సమావేశం సివిల్ సప్లై ఏఐటిసి జిల్లా అధ్యక్షుడు పల్లె శీను అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు చెక్క వెంకటేష్ మాట్లాడుతూ.. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని, కేంద్ర ప్రభుత్వం మోడీ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోట్ల చట్టాలను రద్దు పరచాలని, కార్మిక సంఘాలు పోరాటాలను కొనసాగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు కొరుటూరు శీను, వెంకటేష్, బీరయ్య ,చంద్రయ్య, కుమారు, జాంగిర్, నరేందర్ యాకోబు తదితరులు పాల్గొన్నారు.


