Friday, January 30, 2026
E-PAPER
Homeతాజా వార్తలుప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అవుతారు

ప్రేక్షకులు సర్‌ప్రైజ్‌ అవుతారు

- Advertisement -

తరుణ్‌ భాస్కర్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బా హీరోయిన్‌. ఏఆర్‌ సజీవ్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్‌ ఒరిజినల్స్‌, మూవీ వెర్స్‌ స్టూడియోస్‌ బ్యానర్స్‌ పై సజన్‌ యరబోలు, ఆదిత్య పిట్టీ, వివేక్‌ కృష్ణని, అనుప్‌ చంద్రశేఖరన్‌, సాధిక్‌ షేక్‌, నవీన్‌ సనివరపు ఈ వెంచర్‌ను నిర్మిస్తుండగా, కిషోర్‌ జాలాది, బాల సౌమిత్రి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 30న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సజన్‌ యరబోలు మీడియాతో ముచ్చటించారు.

-యూఎస్‌లో ఫస్ట్‌ డే మార్నింగ్‌ షో సినిమా చూడటం నాకు అలవాటు. దాదాపు అన్ని భాషల సినిమాలు చూస్తుంటాను. ఈ సినిమా చూసిన మరుక్షణమే ఇది తెలుగులో బాగా వర్క్‌ అవుట్‌ అవుతుందనిపించింది. అప్పటికి నేను మలయాళంలో ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా హీరో ద్వారా బాసిల్‌ జోసెఫ్‌ నెంబర్‌ తీసుకుని నిర్మాతలతో మాట్లాడాను. వెంటనే రీమేక్‌ రైట్స్‌ తీసుకున్నాను.

-చిన్నప్పట్నుంచి ఊర్లో కనిపించిన పాత్రలు అనిపించాయి. అమ్మాయిలపై చేయి చేసుకోవడం చూస్తుంటాం. కానీ వాళురివర్స్‌ అయితే పరిస్థితి ఏమిటి అనే పాయింట్‌ నాకు చాలా నచ్చింది. ఆ సినిమా చూస్తున్నప్పుడు తెలుగు సెన్సిబిలిటీస్‌కి ఎలా మార్చుకోవచ్చు అనేది ఆలోచించుకున్నాను. ఓటీటీ తెలుగు డబ్బింగ్‌ ఉన్నప్పటికీ ఈ సినిమాని ఇంకా చాలామంది ఆడియన్స్‌ చూడలేదు. అయితే చూసినవాళ్లకి కూడా ఒక కొత్త అనుభూతి ఇవ్వాలి. దాన్ని ఎలా చేయాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశాం.

-ఈషా తన పాత్రకు 100 శాతం జస్టిఫికేషన్‌ చేసింది. తరుణ్‌ గోదారి యాస కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. తన యాస అద్భుతంగా కుదిరింది. డైరెక్టర్‌ సజీవ్‌ ఈ కథని తనదైన వెర్షన్‌లో రాశాడు. అది నాకు చాలా నచ్చింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -