సుమంత్ కుమార్ హీరోగా సన్నీ సంజరు దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ ‘అనగనగా’. కాజల్ చౌదరి కథా నాయిక. రాకేశ్ రెడ్డి గడ్డం, రుద్రా మదిరెడ్డి నిర్మించారు.
ఇటీవలే ఈటీవీ విన్‌లో రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకొని ఘన విజయాన్ని సాధించింది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ సెలబ్రేషన్‌ని నిర్వహించారు. హీరో సుమంత్ కుమార్ మాట్లాడుతూ,’ఈ సినిమాకి రైటింగ్ చాలా ఇంపార్టెంట్. ‘మళ్లీరావా’ తర్వాత మళ్లీ అద్భుతంగా మంచి అనుభూతిని అందించిన కథ ఇది. దర్శకుడు సన్నీ, రచయిత దీప్తి ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. ఈ సినిమాని శేష్‌కి చూపించాను. అప్పుడు తను చాలా ఎమోషనల్‌గా సినిమాలో విషయం ఉందని చెప్పాడు. ఆ విషయాన్ని ప్రేక్షకులు అందరూ కూడా బల పరిచినందుకు ధన్యవాదాలు. మేము అను కున్న దానికంటే అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ప్రేక్షకులందరికీ నా కతజ్ఞతలు. బేసిగ్గా సినిమాలు థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఓటీటీలోకి వస్తాయి. అయితే ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసి ఇప్పుడు కొన్ని థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నాం. ఆడియన్స్ కూడా బిగ్ స్క్రీన్ మీద చూడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
హీరో అడివి శేషు మాట్లాడుతూ,’ఇది ఒక ఫ్యామిలీ వేడుకలా అనిపిస్తుంది. నా ఫస్ట్ సినిమాకి సుమంత్ గెస్ట్‌గా వచ్చారు. ఆయన అప్పటినుంచి నాకు ఫ్యామిలీనే. ఈ చిత్రంలో వ్యాస్ పాత్రను సుమంత్ అంత బాగా చేయడానికి కారణం ఆయన నిజ జీవితంలోనూ చాలా వరకూ అలా ఉండటమే. సన్నీ సినిమాని అద్భుతంగా తెరకెక్కించారు’ అని చెప్పారు.
అంతకుమించిఅద్భుతమైన రెస్పాన్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES