కేసీఆర్‌కు నోటీసులివ్వడంపై దురుద్దేశం లేదు : టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ముఖ్యమంత్రి, మంత్రుల ప్రమేయం లేకుండా ఫోన్ ట్యాపింగ్ లాంటివి జరిగే అవకాశం లేదని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ అభిప్రాయపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులిచ్చిన నేపథ్యంలో మహేశ్ కుమార్ గౌడ్ మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఉద్యమ నాయకునిగా మాజీ సీఎం కేసీఆర్ అంటే గౌరవం ఉందనీ, అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరు భాగస్వాములో తేలాల్సి ఉందని అన్నారు.
విచారణ పారదర్శకంగా జరగాలనీ, దాదాపు 500కు పైగా ఫోన్లు ట్యాప్ అయినట్టు సమాచారం ఉందని తెలిపారు. జరిగిన వాస్తవాలు తెలుసుకునేందుకు సిట్ ఎవరికైనా నోటీసులివ్వొచ్చని స్పష్టం చేశారు. అధికారులు మాత్రమే ఇలాంటి చర్యలకు పాల్పడరని అభిప్రాయపడ్డారు. సిట్ విచారణ పూర్తయితేనే నిజాలు బయటికి వస్తాయనీ, ఈ విషయంలో వాస్తవాలు తెలియాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్‌కు నోటీసులివ్వటంపై రాజకీయ దురుద్దేశం లేదని కొట్టిపారేశారు. మున్సిపాల్టీల ఎన్నికల కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం తమకు లేదనీ, మెజారిటీ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. బి.ఫార్మ్ విషయంలో ఇన్‌చార్జి మంత్రులకు పూర్తి స్వేచ్ఛ ఉందని మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు.
సీఎం, మంత్రులకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరగదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



