తుదిశ్వాస వరకు ఎర్రజెండా నీడనే కోటి సుబ్బారెడ్డి
• పోతినేని సుదర్శన్‌రావు,
నున్నా నాగేశ్వరరావు నివాళులు
• నవతెలంగాణ అకౌంటెంట్ శివారెడ్డికి
సిబ్బంది ఓదార్పు
నవతెలంగాణ- ఎర్రుపాలెం
తుది శ్వాస వరకు ఎర్రజెండా నీడనే నిలిచి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం పని చేసిన కృషీవలుడు కోటి సుబ్బారెడ్డి మృతి పార్టీకి తీరనిలోటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం శాఖ కార్యదర్శిగా, మండల కమిటీ సభ్యుడిగా పని చేసిన కోటి సుబ్బారెడ్డి గురువారం వడదెబ్బతో ఇంటి వద్ద మృతిచెందారు. ఆయన కుమారుడు శివారెడ్డి నవతెలంగాణ ఖమ్మం రీజియన్ యూనిట్‌లో అకౌంటెంట్‌గా పనిచేస్తున్నరు.మృతదేహాన్ని పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, సుబ్బారావు, స్థానిక నాయకులు సందర్శించారు. పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పోతినేని మాట్లాడుతూ.. ఎర్రుపాలెం మండల కేంద్రంలో పార్టీ నిర్మాణంలో సుబ్బారెడ్డి కీలక పాత్ర పోషించారని, పార్టీ తనకు అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా నమ్మకంగా నిర్వహించారని గుర్తు చేశారు. వృద్ధాప్యం, అనారోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న నాయకుడని చెప్పారు. సుబ్బారెడ్డి అంతిమ యాత్రలో పార్టీ నాయకత్వం, నవతెలంగాణ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, దివ్వెల వీరయ్య, శీలం నరసింహారావు, మండల కార్యదర్శి మద్దాల ప్రభాకర్ రావు, తేలప్రోలు రాధాకృష్ణ, పడకంటి మురళి, నాయకులు, గ్రామ శాఖ కార్యదర్శులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నివాళులర్పించిన నవతెలంగాణ సిబ్బంది
సుబ్బారెడ్డి మృతదేహాన్ని నవతెలంగాణ సిబ్బంది సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శివారెడ్డిని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో నవతెలంగాణ జనరల్ మేనేజర్లు కూచిపూడి రఘు, శశి, సిబ్బంది వీరేష్, చేబ్రోలు నారాయణ, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ఇరుగు వెంకటేశ్వర్లు, వీరారెడ్డి, గుమ్మడి నరసయ్య, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు, మల్లికార్జున్, భాస్కర్, టీడబ్ల్యుజేఎఫ్ నేతలు తదితరులు పాల్గొన్నారు.
వడదెబ్బతో సీపీఐ(ఎం) సీనియర్ నేత మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



