Friday, January 30, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంవీణవంక మినీ మేడారంలో ఉద్రిక్తత

వీణవంక మినీ మేడారంలో ఉద్రిక్తత

- Advertisement -

జాతరకు బయలుదేరిన ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు
కుటుంబీకులతో కలిసి రోడ్డుపై బైటాయింపు
సర్పంచ్‌తో మొదటి పూజకు ఎమ్మెల్యే పట్టు.. అరెస్ట్‌


నవతెలంగాణ-వీణవంక
కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలో మినీ మేడారం జాతరగా ప్రసిద్ధి చెందిన సమ్మక్క-సారలమ్మ జాతరలో గురువారం తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఎండోమెంట్‌ ఆధ్వర్యంలో నిర్వహించాలన్న హైకోర్టు ఉత్తర్వుల మేరకు.. సీపీ గౌష్‌ ఆలం ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే, బుధవారం సారలమ్మను గద్దెకు తీసుకొచ్చే క్రమంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం ప్రత్యేక బలగాల మధ్య సమ్మక్కను ఊరేగింపుగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కుటుంబంతో కలిసి హుజురాబాద్‌ క్యాంపు కార్యాలయం నుంచి జాతర వద్దకు బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. సాయంత్రం పోలీసుల హామీతో సమ్మక్క-సారలమ్మ గద్దెల ప్రాంగణంలోకి ఎమ్మెల్యే చేరుకున్నారు. సర్పంచ్‌ మొదటి కొబ్బరికాయ కొట్టాలని ఎమ్మెల్యే పట్టుబట్టడంతో అధికారులు నిరాకరించారు. దీంతో అధికారులకు, ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఆరెస్టు చేసి పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -