నవతెలంగాణ – జోగిపేట
జోగిపేట మున్సిపల్ 10వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా చౌదరి పేట విజయలక్ష్మి నరసింహులు దంపతులు గురువారం సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు. తమ వార్డు ప్రజలందరితో కలిసి భారీ ఊరేగింపుతో ఉదయం వార్డు నుండి నుండి వార్డు సభ్యులు, ప్రజలు, నాయకులు, మిత్రులు శ్రేయోభిలాషులందరితో కలిసి బాణాసంచా కాలుస్తూ తన వార్డు గుండా ఊరేగింపుగా వెళ్లి తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి రవీందర్ కు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ విజయ డంకా మొగిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి, అందోలు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ ఆధ్వర్యంలో జెండా ఎగరవేస్తామని వారు అన్నారు. వార్డు ప్రజలు తమకు ఓటు వేసి గెలిపించాలని వారు విజ్ఞప్తి చేశారు.
జోగిపేట10వ వార్డు నుంచి నామినేషన్ చేసిన విజయలక్ష్మి నర్సింలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


