Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్14వ వార్డులో నీటి సౌకర్యం కల్పించాలి

14వ వార్డులో నీటి సౌకర్యం కల్పించాలి

- Advertisement -

– అప్పుడప్పుడు మాత్రమే వస్తున్న భగీరథ నీరు
మున్సిపల్ బోర్ నుంచి నీరు సరఫరా చేయడం లేదని ఆవేదన
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి పట్టణంలోని 24 వ వార్డులో నివాసముంటున్న బలే రావ్ సోనియా శంకర్ తన ఇంటికి మిషన్ భగీరథ కలెక్షన్ ఉన్నా అది వారానికి ఒకసారి మాత్రమే వస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. తమ ఇంటి సమీపంలోకి 24 వార్డ్ లో ఉన్న బోరు నుండి పైప్ లైన్ ఉన్న తనకు కలెక్షన్ ఇవ్వడం లేదని, దీంతో తాను తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్నాను అన్నారు. కౌన్సిలర్ ఉన్న సమయంలో 23 వ వార్డు నుంచి తనకు ఆ బోర్డు నుంచి కలెక్షన్ ఇచ్చారని కౌన్సిలర్ పదవీకాలం ముగిసిన తరువాత అక్కడి ప్రజలు నీది 24వ వార్డులో బోరు ఉందని, ఆ బోర్ నుండి నీటిని పట్టుకోవాలని తనకు అక్కడి నుంచి నీరు ఇవ్వడం లేదన్నారు.

మున్సిపల్ బోర్‌ ద్వారా నీటిని పట్టుకొని సరఫరా చేయడం లేదని, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.  ఈ సమస్య తమ వార్డుకు సంబంధించినది కాదంటూ అధికారులు చెప్పడం మరింత ఆందోళన కలిగిస్తోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడి నుండి నీరు రాకపోవడంతో మూడు రోజులకు ఒకసారి రూ.300 చెల్లించి ఇంటి అవసరాల కోసం నీటిని తీసుకుంటామన్నారు. దీంతో నెలకు రూ.3000 నీటికే ఖర్చు చేయవలసి వస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు నీటి సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -