నవతెలంగాణ – మునిపల్లి
విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళి ప్రతిభ పెంచుకోవాలి అని సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ విద్యార్థులకు సూచించారు. మునిపల్లి మండలం కంకోల్ లోని వోక్సెన్ యూనివర్సిటీలో గురువారం సాయంత్రం నిర్వహించిన ఒలింపియాడ్ – 2026 కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమనికి దేశంలోని వివిధ విశ్వవిద్యాలయల నుండి సుమారుగా 125 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే విజయాలు మన వెంటే ఉంటాయని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత మన దేశానికి ఎంతో అవసరమని తద్వారా పరిశ్రమల పరిశ్రమల అవసరాలు తీరడంతో అభివృద్ధి చెందుతాయని చెప్పుకొచ్చారు. అనంతరం ఇతర దేశాల్లో అభ్యాసించాలనుకునే విద్యార్థులకు మార్గనిర్దేశం చేసె జీఆర్ఐ, జిమ్యాట్, సాట్ పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ఇన్వోవేషన్ విభాగం సీఈవో మేరాజ్ ఫహిం, వోక్సెన్ యూనివర్సిటీ సీఈవో విశాల్ ఖుర్మా తదితరులు పాల్గొన్నారు.
ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే విజయాలు మనవెంటే: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
- Advertisement -
- Advertisement -



