కొత్తలూరు, యాచారం శివారులో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ఏర్పాటు
నవతెలంగాణ – పెద్దవూర
భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తున్నది. రైతులకు సబ్సిడీలు కల్పిస్తూ సాగు విస్తీర్ణం పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నది. అందులో భాగంగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర, అనుముల మండాలాల పరిధిలోని కొత్తలూరు, యాచారం గ్రామ శివారులో 32 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పాటు చేస్తున్నఆయిల్ పామాయిల్ కర్మాగారానికి పతంజలి ఫుడ్స్ లిమిటెడ్, పతంజలి సౌత్ జోన్ మేనేజర్ కూన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జ్యోతి ప్రజ్వ లన చేసి నవధాన్యాలు చల్లి నూతన ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ఘనంగా భూమి పూజా నిర్వహించారు. ఈ సందర్బంగా పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ డీజీఎం ప్లాంటేషన్ యాదగిరి మాట్లాడుతూ ఈ యూనిట్ ప్రారంభం నల్గొండ జిల్లాలోని ఆయిల్ పామ్ రైతులకు ఒక చారిత్రాత్మక అవకాశంగా నిలుస్తుందని తెలిపారు.
ప్రస్తుతం నల్గొండ జిల్లాలో సుమారు 14,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు జరుగుతుండగా, అందులో 2,500 ఎకరాలు ఫలదాయక దశలో ఉన్నాయని, అన్నారు. ఇక్కడ ప్రారంభించిన ఈ ఆయిల్ పామ్ మిల్ రైతులకు తమ పంటకు దగ్గరలోనే ప్రాసెసింగ్ సౌకర్యం కల్పించి, రవాణా ఖర్చులు తగ్గించి మెరుగైన ఆదాయం అందించనుందని తెలిపారు. ప్రారంభ దశలో ఈ మిల్‌ను 10 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ప్రారంభించగా, భవిష్యత్తులో దీనిని 120 మెట్రిక్ టన్నుల సామర్థ్యం వరకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిశ్రమ ద్వారా ఫ్యాక్టరీ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు రోజువారీ కూలీలు, శాశ్వత ఉపాధి అవకాశాలు లభించనున్నాయని అలాగే ఈ ప్రాంతం ఆర్థికంగా, మౌలిక సదుపాయాల పరంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఆయిల్ మ్ ప్రాసెసింగ్ యూనిట్ ప్రారంభం ద్వారా నల్గొండ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు మరింత విస్తరించి, రైతుల ఆదాయం పెరగడంతో పాటు గ్రామీణ ఉపాధి బలోపేతం అవుతుందని పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ ప్రతినిధులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది జనవరి 30 లోపుపూర్తి చేసి ప్రారంబొత్స వానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తునట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో కొత్తలూరు సర్పంచి రాంబాబు, ఉపసర్పంచి నులక సిద్ధార్డ్ రెడ్డి, కమ్మంపాటి శ్రీను, పోషం చిన్న కోటిరెడ్డి, చీఫ్ ఇంజనీర్ సంఘాని కుమార్, నార్తు జోన్ మేనేజర్ రవీందర్ రెడ్డి, రైతులుషేక్ బాలేమియా, నులక దేవేందర్ రెడ్డి, చంద్రారెడ్డి, పతంజలి ఆఫీసర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, నర్సరీ అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



