నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని గాంధీనగర్ లో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వేడుకలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సుంకేట రవి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దేశానికి గాంధీజీ చేసిన సేవలను కొనియాడారు. గాంధీజీ సూచించిన శాంతి మార్గంలో యువత ముందుకు నడవాలి అన్నారు.ఈ కార్యక్రమంలో కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సుంకేట బుచ్చన్న, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సల్లూరి గణేష్ గౌడ్, నాయకులు సింగిరెడ్డి శేఖర్, వేములవాడ జగదీష్, దూలూరి కిషన్ గౌడ్, ఆల్గో రంజిత్, రాజేశ్వర్, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -



