నవతెలంగాణ- చిన్నకోడూరు
తెలంగాణ సాధించిన, కేసిఆర్ కు నోటీసులు ఇచ్చి తెలంగాణ ప్రజలను అవమానించారని బిఆర్ఎస్ నాయకులు జంగిటి శ్రీనివాస్, పిన్నింటి అబ్బిరెడ్డిలు ప్రభుత్వం పై మండిపడ్డారు. శుక్రవారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఫోన్ టాపింగ్ కేసులో కేసిఆర్ కు నోటీసులు ఇచ్చారని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందించి, రాస్తారోకో ధర్నా నిర్వహించారు. అక్కడికి చేరుకున్న సిద్దిపేట రూరల్ సీఐ శ్రీనివాస్ సంఘటన స్థలానికి చేరుకొని వారికి నచ్చజెప్పి రాస్తారోకో విరమింప చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన కెసిఆర్ కు నోటీసులు ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులతోపాటు తెలంగాణ ప్రజలను కూడా అవమానించారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులపై కక్ష సాధింపు వదులుకొని ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయాలని సూచించారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో మున్సిపల్, ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు న ముండ్ల హరీష్,సామల మధు,లింగం, సుంచు ఎల్లయ్య, కొత్త శంకర్, సుంచు రమేష్, పిల్లి నరసింహులు, పెండెల బాలయ్య,, నెమలి సుభాష్, కామ శ్రీనివాస్, రాజ శేఖర్ రెడ్డి వివిధ గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.



