Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జంతు సంక్షేమ పక్షోత్సవంపై విద్యార్థులకు అవగాహన

జంతు సంక్షేమ పక్షోత్సవంపై విద్యార్థులకు అవగాహన

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి
తెలంగాణ ప్రభుత్వము, పశువైద్య  పశుసంవర్ధక శాఖ, కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జంతు సంక్షేమ పక్షోత్సవం (Animal Welfare Fortnight Celebration) కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం కామారెడ్డి మండలం ఇస్రోజీవాడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు జంతు సంక్షేమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు జంతువుల పట్ల దయాభావం పెంపొందించుకోవడం, వీధి జంతువులను హింసించకుండా సంరక్షించడం, పశువులకు సరైన ఆహారం, స్వచ్ఛమైన నీరు అందించడం, జంతువుల ఆరోగ్యం, పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, పర్యావరణ పరిరక్షణలో జంతువుల పాత్ర వంటి అంశాలపై సరళమైన, పిల్లలకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించారు. విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని పలు ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. 

ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, చిన్న వయస్సు నుంచే జంతు సంక్షేమంపై అవగాహన కల్పిస్తే భవిష్యత్తులో సమాజానికి బాధ్యతగల పౌరులు తయారవుతారని అన్నారు. జంతువుల పట్ల దయ, మానవత్వం కలిగిన సమాజ నిర్మాణానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన పాఠశాల సిబ్బంది మరియు గ్రామ ప్రజాప్రతినిధులకు అధికారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ అవగాహన కార్యక్రమంలో పశుసంవర్ధక జిల్లా అధికారి డా. శ్రీనివాస్, కామారెడ్డి మండల పశువైద్య అధికారి డా. రవికిరణ్, డా. అనిల్ రెడ్డి,  ఇస్రోజీవాడ గ్రామ సర్పంచ్  సి.హెచ్. మల్లేష్, ఉప సర్పంచ్  స్వామి, ఇస్రోజీవాడ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ (హెచ్ఎం),పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -