Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మార్వాడి వ్యాపారి బెదిరింపులను తీవ్రంగా ఖండుస్తున్నాం

మార్వాడి వ్యాపారి బెదిరింపులను తీవ్రంగా ఖండుస్తున్నాం

- Advertisement -

బిసి జెఏసి జిల్లా నాయకుడు కుమార్ యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు 

చెన్నూర్ మున్సిపాలిటీలో అక్రమ బీసీ సర్టిఫికెట్ల కుట్ర బెదిరింపులకు దిగిన మార్వాడి వ్యాపారి శ్యామ్ సుందర్ దేవుడా చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా బిసిజెఏసి జిల్లా నాయకుడు చింతల కుమార్ యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ గా బీసీ మహిళ రిజర్వేషన్ కావడంతో రాజస్థాన్ నుండి వలస వచ్చి స్థిరపడిన మార్వాడి వ్యాపార వర్గాలు అక్రమంగా బీసీ సర్టిఫికెట్లు పొందినట్లు అనేక ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయన్నారు.

ఈ అంశంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీసీ జేఏసీ చెన్నూర్ చైర్మన్ సిద్ది రమేష్ యాదవ్  ఇటీవల ఇంటర్నల్ గా చర్చ కార్యక్రమం నిర్వహించారని తెలిపారు. ఈ చర్చ వలన అక్రమంగా బీసీ సర్టిఫికెట్లు పొందిన వారికి మున్సిపల్ ఎన్నికల్లో బి-ఫారమ్‌లు రాకుండా అడ్డుకట్ట పడిందన్నారు. దీంతో తీవ్ర అసహనానికి గురైన చెన్నూరుకు చెందిన మార్వాడి వ్యాపారవేత్త శ్యామ్ సుందర్ దేవుడా సిద్ది రమేష్ యాదవ్ ను బెదిరింపులకు పాల్పడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఇలాంటి బెదిరింపులు భయపడేది లేదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి, బీసీ హక్కుల కోసం పోరాడే నాయకులపై దాడులు చేయడం సహించేది లేదన్నారు. జిల్లా పోలీస్ అధికారులను వెంటనే ఈ బెదిరింపులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అక్రమ బీసీ సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -