- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని మల్లుపల్లి గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఐ బాలయ్య పౌర హక్కుల పై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కులమతాలకు అతీతంగా కలిసి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నారాయణ, ఉప సర్పంచ్ సుజాత, జీపీఓ లింగయ్య, ఎస్సీ హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ సాయిలు, వార్డు సభ్యులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



