Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోటరీ ఒకేషనల్ ఎక్స్లెన్స్ సర్వీస్ అవార్డ్స్ ప్రధానం

రోటరీ ఒకేషనల్ ఎక్స్లెన్స్ సర్వీస్ అవార్డ్స్ ప్రధానం

- Advertisement -

నవతెలంగాణ – కంఠేశ్వర్ 
స్థానిక బర్కత్పురా లో గల రోటరీ కార్యాలయంలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో రోటరీ వోకేషనల్ సర్వీస్ ఎక్స్ల్లెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు అధ్యక్షులు శ్యామ్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ మాజీ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది ఎం రాజేందర్ రెడ్డి హాజరై పురస్కార గ్రహీతల ను ఉద్దేశించి మాట్లాడుతూ రోటరీ అంతర్జాతీయ సంస్థ ప్రతి సంవత్సరం జనవరి మాసంలో రోటరీ ఒకేషనల్ సర్వీస్ ఎక్స్ల్లెంట్ అవార్డ్స్ ప్రధానోత్సవ కార్యక్రమాన్ని అంతర్రాష్ట్ర స్థాయిలో ప్రతి క్లబ్బులు నిర్వహిస్తాయని అన్నారు.

దీనిలో భాగంగానే రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా అవార్డులను అందుకుంటున్నటువంటి ఉద్యోగరీత్యా రానిస్తున్నటువంటి రిటైర్డ్ రిజిస్ట్రేర్ ప్రొఫెసర్ కే సాయిలు, ప్రముఖ న్యాయవాది రాజ్కుమార్ సుబేదార్, ట్రాఫిక్ ఏఎస్ఐ ఏ శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి నర్సింగ్ ఆఫీసర్ ప్రత్యూష, నిజామాబాద్ ఆర్టీసీ పర్సనల్ ఆఫీసర్ పద్మజ మరియు యు వి ఫౌండేషన్ ఫౌండర్ డి సృజన్ కుమార్ లకు అవార్డ్స్ లని వారు చేస్తున్నటువంటి ఉద్యోగరీత్యా పనులు మరియు ప్రజలకు అందిస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా అందజేయడం అభినందనీయం అన్నారు.

ఈ అవార్డ్స్ ద్వారా అవార్డు గ్రహీతలకు ప్రోత్సాహం లభించి వారి వారి కార్యాచరణలో మరింత రనిస్తారాని కోరుకుంటున్నాను. కార్యక్రమంలో క్లబ్ డైరెక్టర్ వి శ్రీనివాసరావు, సభ్యులు, డాక్టర్ అంకిత్ అగర్వాల్, హరి ప్రసాద్, జి రామకృష్ణ, సతీష్ షా, తులసీదాస్ పటేల్, పార్సీ రాజేశ్వర్, సుధీర్ గుప్తా, శ్రీకాంత్ జావార్ తదితర సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -