Wednesday, July 29, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్

మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్

- Advertisement -

– పట్టించుకోని అధికారులు
– వర్షాల కారణంగా నీటి కాలుష్యంపై గ్రామస్థుల ఆందోళన
– నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలకు ఇబ్బందులు
నవతెలంగాణ – ఉప్పునుంతల

నాగర్‌కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం రాయిచేడ్ గ్రామ పరిధిలో పంచాయతీరాజ్ రహదారి పక్కన ఉన్న మిషన్ భగీరథ తాగునీటి పైప్‌లైన్ లీకేజీకి గురై పెద్దఎత్తున తాగునీరు వృథాగా పోతోంది.రోజులు గడుస్తున్న ఇప్పటి వరకు ఎలాంటి మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా లీకేజీ ప్రాంతంలో వర్షపు నీరు, మురుగు నీరు పైప్‌లైన్‌లోకి చేరే అవకాశం ఉండటంతో తాగునీరు కలుషితమయ్యే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.

పైప్‌లైన్ లీకేజీ కారణంగా గ్రామానికి సక్రమంగా తాగునీటి సరఫరా అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత మిషన్ భగీరథ అధికారులు వెంటనే స్పందించి లీకేజీని మరమ్మతు చేసి, స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరాయంగా సరఫరా చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -