సర్పంచ్ జ్యోతి అంబదాస్ నాయక్
నవతెలం-గాణ నవాబ్‌పేట్
తాండ అభివృద్ధికి తండా ప్రజలంతా సహకరించాలని రామ్ సింగ్ తండా సర్పంచ్ జ్యోతి అంబదాస్ నాయక్ అన్నారు.ఈ సందర్భంగా మంగళవారం గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో వారు మాట్లాడుతూ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసి తాండాకు కావాల్సిన నిధులను మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు.నూతన పంచాయతీ భవనానికి ఎంఎల్ఏ అనిరుద్ రెడ్డి, మాజీ డీసీసీ అధికార ప్రతినిధి దుశ్యంత్ రెడ్డి కృషితో నిధులు మంజూరు చేసారని వెంటనే గ్రామ పంచాయతీ భవనం శంఖుస్థాపనకు ముహూర్తం ఖరారు చేస్తామని చెప్పారు దీంతోపాటు నూతన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
తాండా అభివృద్ధికి ప్రజలంతా సహాకరించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



