Tuesday, September 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తిమ్మయపల్లిలో ఫారం పాండు నిర్మాణం ప్రారంభం 

తిమ్మయపల్లిలో ఫారం పాండు నిర్మాణం ప్రారంభం 

- Advertisement -

నవతెలంగాణ-నవాబుపేట
మండల పరిధిలోని తిమ్మయపల్లిలో ఎంపీడీవో జయరాం నాయక్ ఎంపీఓ భద్రు నాయక్ ఏపీఓ జ్యోతి, సర్పంచ్ ఆధ్వర్యంలో రైతు పొలంలో ఫారం పాండు నిర్మాణం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపిడీఓ జయరాం నాయక్ మాట్లాడుతూ.. రైతుల పొలాల్లో ఫారం పాండ్ నిర్మాణం చేసుకుంటే పండించే పంటలకు నీటి సరఫరాలో అంతరాయం లేకుండా ఉంటుంది అని, ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు ఉచితంగా ఏర్పాటు చేసుకునే సదుపాయం ఉంది అని సూచించారు .ఈ అవకాశం ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఏ జైపాల్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి క్షేత్ర స్థాయి అధికారి, ఫీల్డ్ అసిస్టెంట్ ఉపాధి హామీ కూలీలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -