Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్

మీడియా సెంటర్ ను ప్రారంభించిన కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలను పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ లోని ఎన్ .ఐ.సి వీడియో కాన్ఫరెన్స్ హల్ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ను స్థానిక సంస్థల అదనపు  కలెక్టర్ భాస్కర్ రావు తో కలసి శుక్రవారం కలెక్టర్ ప్రారంభించారు. మీడియా కోసం అందుబాటులో ఉన్న సదుపాయాలను, ఎంసిఎంసి విధుల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా  కలెక్టర్ మాట్లాడుతూ..మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన  సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా సెంటర్  ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు అందించాలని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా స్థాయిలో మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో  డి.పి.ఆర్.ఓ  అరుంధతి, సిబ్బంది లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -