నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం, చలకుర్తి గ్రామ సర్పంచ్ సల్లా అంజిరెడ్డి ఆహ్వానం మేరకు శ్రీ శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలో దాత బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న పాల్గొన్నారు. తదనంతరం సర్పంచ్ సల్లా అంజిరెడ్డిని బుసిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పాండన్న ఈ సందర్బంగా శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మహా అన్నదానం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తిరుమలగిరి సాగర్ మండలం మాజీ వైస్ యంపిపి యడవెల్లి దిలీప్ కుమార్ రెడ్డి, తిరుమలనాధ గుడి మాజీ ఛైర్మన్ బుర్రి రామిరెడ్డి, కొత్తపల్లి ఫ్యాక్స్ మాజీ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి, కొట్టె బాలయ్య యాదవ్, గాలిమెట్టి శివ, షేక్ ముస్తాఫ, చామల మధుసూదన్ రెడ్డి, ఆదిరెడ్డి, బుసిరెడ్డి మట్టారెడ్డి, చామల జయంత్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణోత్సవంలో అన్నదానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



