Friday, January 30, 2026
E-PAPER
Homeఖమ్మంరైతులకు తప్పని యూరియా అగసాట్లు

రైతులకు తప్పని యూరియా అగసాట్లు

- Advertisement -

యాప్ ద్వారానే యూరియా పంపిణీ 
ముష్టికుంట సొసైటీకి 890 యూరియా కట్టలు 
ప్రస్తుతం వచ్చిన యూరియా కట్టలకు నమోదుకు సరిపోయాయి 
మరి కొద్ది రోజులలో యూరియా మరలా వస్తుంది 
సొసైటీ సీఈఓ కొండా రాంబాబు
నవతెలంగాణ – బోనకల్ 

ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని బోనకల్ మండలంలో రోజులు గడుస్తున్నా సరే అన్నదాతలకు యూరియా అగసాట్లు తప్పడం లేదు. బోనకల్ మండల పరిధిలో 9 సహకార సంఘాల నుంచి అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం యూరియాను ఈ నెల 29వ తేదీ వరకు మ్యాన్యువల్ ద్వారా పంపిణీ చేశారు. 30వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా మాత్రమే యూరియా పంపిణీ చేయనున్నట్లు మండల వ్యవసాయ శాఖ అధికారి పసునూరి వినయ్ కుమార్ తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం ముష్టికుంట్ల సొసైటీ నుంచి యూరియా పంపిణీ ప్రారంభించారు. అయితే రెండు మూడు రోజుల క్రితం అన్నదాతలకు కూపన్లు పంపిణీ చేశారు. ఆ కూపన్లు ఆధారంగా సొసైటీ సిబ్బంది యాప్ పై అవగాహన ఉన్నవారు ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నమోదు చేయించి యూరియాను పంపిణీ చేస్తున్నట్లు ఆ సంఘం సీఈవో కొండా రాంబాబు తెలిపారు.

ముష్టికుంట సహకార సంఘానికి 890 యూరియా కట్టలు వచ్చినట్లు సీఈఓ రాంబాబు తెలిపారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే ప్రతి ఒక్కరికి యూరియా పంపిణీ చేయనున్నట్లు రాంబాబు తెలిపారు. ముష్టికుంట్ల సహకార సంఘానికి వచ్చిన ఎనిమిది వందల తొంబై కట్టలకు సంబంధించి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులందరికీ యూరియాను పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా కొంతమంది రైతులు తమకు పర్టీలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నమోదు చేసుకునే విధానం కోసం స్మార్ట్ ఫోన్లు లేవని అలాంటి రైతులకు ఈ యాప్ వలన ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన విధంగానే తాము యూరియా పంపిణీ చేస్తామని గతంలో లాగా మాన్యువల్ పద్ధతి ప్రకారం యూరియా పంపిణీ చేయడం లేదని రాంబాబు స్పష్టం చేశారు. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే ఇకనుంచి యూరియా పంపిణీ జరుగుతుందని రైతులందరూ అర్థం చేసుకొని సహకరించాలని ఆయన కోరారు. అయితే యూరియా కోసం అన్నదాతలు ఎప్పటిలాగే సొసైటీ కార్యాలయానికి తెల్లవారుజాము నుంచే రాక ప్రారంభించారు. అనేకమంది అన్నదాతలు ఫర్టిలైజర్ యాప్ అర్థం కాక అవస్థలు పడ్డారు. 

20 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశా: దొడ్డ నాగరాజు, రైతు, ముష్టికుంట్ల
తాను ముష్టికుంట్లలో 20 ఎకరాలలో మొక్కజొన్న పంట సాగు చేశా. గతంలో ఇదే సొసైటీ నుంచి 19 యూరియా కట్టలు తీసుకున్నాను. కానీ అవేమి సరిపోవటం లేదు. యూరియా తనకు కావలసినంత అందుబాటులో లేకపోవడంతో కోదాడలో రూ 450 రూపాయల చొప్పున 20 కట్టలు తీసుకువచ్చి మొక్కజొన్నకు వేశాను. ప్రస్తుతం మరో 20 కట్టల వరకు అవసరము ఉంది. యూరియా కోసం ముష్టికుంట సొసైటీ వద్దకు వెళ్లి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నమోదు చేసుకుందామని ప్రయత్నం చేస్తుంటే కావడం లేదు. ప్రస్తుతం తక్షణం మొక్కజొన్నకు యూరియా వేయకపోతే దెబ్బతిన ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు రైతులకు పూర్తిస్థాయిలో యూరియా అందుబాటులో ఉందని చెబుతున్నారని మరొకవైపు యూరియా కోసం వెళితే అయిపోయినాయి అని చెబుతున్నారని తెలిపారు. 

 సొసైటీ సీఈఓ రాంబాబు వివరణ: 
ముష్టికుంట్ల సొసైటీకి ప్రస్తుత ఎనిమిది వందల తొంబై యూరియా కట్టలు వచ్చాయి. రెండు మూడు రోజుల క్రితం కొంతమంది అన్నదాతలకు కూపన్లు ఇచ్చాము. ఆ రైతులు సొసైటీ కార్యాలయముకు వద్దకు వచ్చిన తర్వాత తామే పర్టీలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నమోదు చేసి వారికి ముందుగానే యూరియా పంపిణీ చేశాము. ప్రస్తుతం ఎనిమిది వందల తొంబై కట్టలు వచ్చాయనింటికి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా మొత్తం నమోదు అయినట్లు తెలిపారు. నమోదు చేసుకున్న వారందరికీ యూరియా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మరి కొంతమంది యూరియా కోసం వచ్చారని తెలిపారు.సొసైటీ కి వచ్చిన యూరియా కట్టలన్నింటికీ ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా రైతులు పూర్తిగా నమోదు చేసుకున్నారు. మరలా యూరియా వచ్చిన తర్వాత పర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా నమోదు చేసుకున్న రైతులందరికీ వరుస క్రమంలో పంపిణీ చేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -