Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నసురుల్లాబాద్ లో బీఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో 

నసురుల్లాబాద్ లో బీఆర్ఎస్ ధర్నా, రాస్తారోకో 

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
మాజీ సీఎం కేసీఆర్ కు రాష్ట్ర ప్రభుత్వం సిట్ నోటీసులు పంపడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం నసురుల్లాబాద్ మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకుడు నర్సింలు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు సిట్ నోటీసులు పంపడం తగదన్నారు. అనంతరం సీఎం ఫ్లెక్సీని దగ్ధం చేయడానికి ప్రయత్నించగా, పోలీసులు నిలువరించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

బీఆర్‌ఎస్ పార్టీ పై ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండించారు. ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో టిఆర్ఎస్వి మాజీ రాష్ట్ర కార్యదర్శి ఎర్రవట్టి సాయిబాబా టేకర్ల సాయిలు, మైలారం మాజీ సర్పంచ్ మహేందర్ , వెంకట్ సార్, భూషణ్ ,రమేష్, భూమయ్య, .కుమార్. ఉప్పర్ సాయిలు. లక్ష్మణ్ . రవి. గంగారం సాయిలు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -