నవతెలంగాణ – బాల్కొండ
రానున్న పదవ తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని నిరంతరం కృషి చేయాలని సత్ఫలితాలు సాధించాలని ఎంఈఓ ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం పాఠశాలల సముదాయిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ తరగతుల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు కార్యచరణ సిద్ధం చేసుకోవాలని అన్నారు. ఉపాధ్యాయుల కృషితోనే సత్ఫలితాలు సాధ్యమవుతాయని అన్నారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించి విద్యార్థుల జ్ఞానాభివృద్ధికి తోడ్పాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విషయనిపుణులు డాక్టర్ ఓం ప్రకాష్, కార్యదర్శి శ్రీలక్ష్మి, ఆర్.పి నాగులపల్లి రాజేందర్ గౌడ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నిరంతర కృషితో సత్ఫలితాలు సాధించాలి: ఎంఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



