నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లా సమాఖ్య సమావేశ మందిరం లో సీనియర్ సి.ఆర్.పి ఫీడ్ బ్యాక్ సెషన్ డిఆర్డిఓ నాగిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సమాఖ్య ప్రతినిధులకు మండల సమాఖ్య సమావేశములు , గ్రామ సంఘం సమావేశములు నిర్వహణ ఆర్థిక క్రమశిక్షణ, నూతనముగా ఏర్పాటు చేసిన 530 స్వయం సహాయక సంఘములకు శిక్షణా కార్యక్రమములు, వారి కటుంబ వివరాలను అన్ లైన్ లో నమోదు చేయుటకు నిర్వహించవలసిన అజీవిక రిజిస్టర్ , మహిళా సంఘములకు ఇచ్చిన బ్యాంక్ లింకేజ్ బ్యాంక్ లోన్లు, తిరిగి చెల్లించుట, క్రొత్తగా గుర్తించిన ఎంటర్ ప్రైజెస్, అంశములపై సమీక్ష నిర్వహించినారు. ఈ సమావేశములో అడిషనల్ డిఆర్డిఓ జంగారెడ్డి, డిపియం లు , ప్రతీ మండలం నుండి ఏ.పి.యం, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, అకౌంటెంట్ లు హాజరయ్యారు.
సంఘ నిర్వాహణపై ఆర్థిక క్రమశిక్షణపై సమీక్ష నిర్వహించిన డిఆర్డి ఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



