Friday, January 30, 2026
E-PAPER
Homeకరీంనగర్ఎస్ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ

ఎస్ఎస్ టీ చెక్ పోస్ట్ తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో రగుడు వద్ద  ఏర్పాటు చేసిన ఎస్ ఎస్ టీ చెక్ పోస్ట్ ను జిల్లా మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు, వ్యయ పరిశీలకులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, రాజ్ కుమార్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ లో ఉన్న సిబ్బంది వద్ద ఉన్న వివిధ రిజిస్టర్లు పరిశీలించారు. వారికి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తరలిస్తున్న రూ. 20 లక్షల డబ్బులు సీజ్ చేశామని, తదుపరి విచారణ కోసం పోలీసులకు అప్పగించామని అధికారులు తెలిపారు. తనిఖీలో నోడల్ అధికారులు నవీన్ కుమార్, భారతి తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -