- Advertisement -
-అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్
నవతెలంగాణ – రాయికల్
పట్టణంలోని మున్సిపాలిటీలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.రాజ గౌడ్ శుక్రవారం పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ,స్క్రూటినీ,అప్పీల్స్ పరిష్కారం,గుర్తుల కేటాయింపు తదితర ప్రక్రియలు సజావుగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.దాఖలైన నామినేషన్ల వివరాలను రోజువారీగా టీ-పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని సూచించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.నాగరాజు,రిటర్నింగ్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



