Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పూజారి మురళి కుటుంబానికి ఎస్ఎస్‌సి బ్యాచ్ పరామర్శ

పూజారి మురళి కుటుంబానికి ఎస్ఎస్‌సి బ్యాచ్ పరామర్శ

- Advertisement -

నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం టంగుటూరు గ్రామానికి చెందిన పూజారి మురళి అకాల మరణం పట్ల రామకృష్ణ విద్యాలయం ఎస్ఎస్‌సి 1996–97 బ్యాచ్ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా వారి కుటుంబాన్ని పరామర్శించి, మురళితో గల చిన్ననాటి అనుబంధాలను స్మరించుకున్నారు. ఎస్ఎస్‌సి బ్యాచ్‌కు చెందిన చింతకింది వెంకటేష్, ద్వారపు శివశంకర్,చిక్క శ్రవణ్ కుమార్‌లు మురళి కుటుంబ సభ్యులను కలిసి, వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పెద్ద మనసుతో స్పందించారు.తమ వంతు సహాయంగా ప్రతి ఒక్కరి సహకారంతో సేకరించిన రూ.1,00,000 (ఒక లక్ష రూపాయల) మొత్తాన్ని మురళి కుటుంబానికి అందజేశారు. ఈ సహాయ కార్యక్రమానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ఎస్ఎస్‌సి బ్యాచ్ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -