నవతెలంగాణ – ముధోల్
గ్రామీణ ప్రాంతాల్లో ని విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకే సీఎం కప్ క్రీడ పోటీలు దోహద పడుతాయని ఎంపీడీవో లవ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆవరణలో మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామాల్లో ఎంతోమంది ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఉన్నారని, వారి ప్రతిభను చాటేలా విద్యార్థులు సీఎం కప్ క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామ. మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించి విద్యార్థులు మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఖోఖో,కబడ్డి,వాలీబాల్ క్రీడలను నిర్వహించారు.
ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాధికారి రమణ రెడ్డి,ముధోల్ గ్రామ సర్పంచ్ శభాన బేగం, పాఠశాల పీడీ శ్రీనివాస్, అసిస్టెంట్ అశోక్ కుమార్ ఆయా గ్రామాల నుంచి వచ్చిన ప్రధానోపాధ్యాయులు,సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



