- Advertisement -
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
మండల కేంద్రంలోని 63వ నంబర్ జాతీయ రహదారి పక్కన కూడుకుపోయిన మురికి కాలువ పునరుద్ధరణ పనులను శుక్రవారం చేపట్టారు. స్థానిక గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జెసిబిని ఏర్పాటు చేసి రోడ్డు వెంట మురికి కాలువను తవ్వించారు. గత కొంతకాలంగా కాలువ కూడుకుపోయి ఉండడంతో మురికి నీరుతో పాటు వర్షాలు కురిసిన సమయంలో వర్షపు నీరంతా రోడ్డుపైనే ప్రవహించి వాహనదారులకు ఇబ్బందిగా ఉండేది.మురికి కాల్వ పూర్తిగా మట్టి ముళ్లపొదలతో నిండిపోయిన నేపథ్యంలో పునరుద్ధరణ పనులు చేపట్టారు. జెసిబి తో కాల్వను శుభ్రం చేసి మురికి నీరు సవ్యంగా ప్రవహించేల ఏర్పాటు చేసినట్లు ఉపసర్పంచ్ కొత్తపల్లి అశోక్ తెలిపారు.
- Advertisement -



