కల్లూరి మల్లేశం సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మున్సిపాలిటీలోని 3 వ వార్డుకు సీపీఐ(ఎం) అభ్యర్థిగా మొరి గాడి రమేష్, 4 వ వార్డుకు అభ్యర్థిగా మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ లు శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ఆలేరు మున్సిపాలిటీ గత పాలకవర్గం నిర్లక్ష్యం వల్ల అనేక సమస్యలు పేరుకుపోయాయి అన్నారు. పాలకవర్గంలోనూ ప్రజా సమస్యలు నిరంతరం ఎజెండాగా ఉండి అవి పరిష్కారం కావాలంటే ప్రజా పోరాటాలు లో ముందుండే సీపీఐ(ఎం) అభ్యర్థులను గెలిపించాలని ఆయన అన్నారు.
ఎన్నికలంటే కేవలం కులం,మతం మద్యం,ధనం అనే ఎజెండాగా చర్చకు రాకుండా ప్రజా సమస్యలు వాటి పరిష్కార మార్గాలు ఎన్నికల ఎజెండాగా ఉండాలి అన్నారు. పాలకవర్గంలో ప్రశ్నించే స్వభావం లేనివారు ప్రజా సమస్యలపై అవగాహన లేని వారు ఉండటం వల్ల సమస్యలు పరిష్కారం కావు అని మున్సిపల్ పాలకవర్గం ప్రజలకు మౌలిక వసతులు కల్పించలేవని ప్రజా సమస్యలపై అవగాహనతో నిరంతరం వాటికి కోసం పోరాడే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సుత్తె కొడవలి నక్షత్రం గుర్తుపై ఓటెయ్యాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా నాయకులు ఎం ఏ ఇక్బాల్ సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దూపటి వెంకటేష్,మొరిగాడి అజయ్,వడ్డేమాన్ బాలరాజు,ఘణగాని మల్లేష్, చేన్న రాజేష్,కాసుల నరేష్,మోరిగాడి అశోక్, అంజయ్య,మొరిగాడి స్వరూప,అనిత మోరిగాడి రాజు, పృద్వి,అయిలి అంజమ్మ,ఎండి మతిన్,ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.




