Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుడూరులో స్పర్శ లెప్రసిపై అవగాహన

గుడూరులో స్పర్శ లెప్రసిపై అవగాహన

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని గుండూరు గ్రామంలోని ఎంపీపీ ఎస్ పాఠశాలలో రాష్ట్ర, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జుక్కల్ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు విట్టల ఆధ్వర్యంలో ఏఎన్ఎం లక్ష్మీకాంతం, ఏఎన్ఎం శాలు ఆశాలు గుండూరు రాజకల, లొంగన్ లలిత కార్యకర్తలు కుష్టు వ్యాధి నివారణ కొరకు గుండూరు సబ్ సెంటర్ పరిధిలోని ఐదు గ్రామాలలో గ్రామలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జనవరి 30వ నుంచి ఫిబ్రవరి 13వ వరకు లాప్రోసి పైన మండలంలోని ప్రతి ఒక్క గ్రామాలలో అవగాహన చేసేందుకు శుక్రవారం పాఠశాల విద్యార్థులతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.

అందులో భాగంగా గ్రామాలలో ప్రజలకు అప్రమత్తం చేసేందుకు ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిందని తెలిపారు. అదేవిధంగా మండలంలోని జుక్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జి పి సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జుక్కల్ పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కుష్టి రోగులకు ప్రభుత్వం నిరంతరము అందుబాటులో ఉందని తెలిపారు. కావున ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి, ఒకవేళ కుష్టి వ్యాధి లక్షణాలు చర్మం పైన స్పర్శ లేని మచ్చలు, కను బొబ్బలు కను రెప్పలు రాలిపోవడం, కాళ్లు తిమ్మిరి రావడం కాళ్ల వాపులు పెరగడం వంటివి జరుగితే మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి లేదా ప్రైమరీ  హెల్త్ సెంటర్ సిబ్బందిలకు తెలియజేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో గుండూరు ఎంపీపీ ఎస్  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎం . భారతి, జుక్కల్  ఉప సర్పంచ్ షేక్ ఫిర్దోస్, శ్రీనివాస్ గౌడ్ సెక్రటరీ, సీనియర్ అసిస్టెంట్ రాజు ,బిల్ కలెక్టర్ మనోజ్, కాంగ్రెస్ యువ నాయకుడు నర్సింగ్, పీహెచ్ ఆఫీసర్ అంబిక,ఆశా వర్కర్స్, సులోచన, శ్రీదేవి, గ్రామ ప్రజలు పాల్గున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -