- Advertisement -
నవతెలంగాణ-మునుగోడు
పల్లె దావకాలలో విధులు నిర్వహించే ఏఎన్ఎంలు, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండకుండా నిర్లక్ష్యం వహిస్తే శాఖపరమైన చర్యలు తప్పవని డి ఎం హెచ్ ఓ పుట్ట శ్రీనివాస్ హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని కొంపల్లి గ్రామంలో పల్లె దవకాలను ఆకస్మిక తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలలో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పల్లె దావకానలలో నాణ్యమైన వైద్యం అందే విధంగా ప్రజలకు వైద్యం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో వేణుగోపాల్ రెడ్డి , మండల వైద్యాధికారి మాధురి , సిబ్బంది తదితరులు ఉన్నారు.
- Advertisement -



