Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మంత్రిని సన్మానించిన ఆరోగ్య మిత్రాల యూనియన్

మంత్రిని సన్మానించిన ఆరోగ్య మిత్రాల యూనియన్

- Advertisement -

నవతెలంగాణ-మర్రిగూడ
ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లోని ఆరోగ్యశ్రీ విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న ఆరోగ్య మిత్రాల యొక్క న్యాయమైన డిమాండ్లను కొన్ని నెరవేర్చినందుకుగాను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను హైదరాబాదులోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో గురువారం మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన ఆరోగ్య మిత్రాల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గిరి యాదయ్య ఆధ్వర్యంలో శాలువాతో సన్మానించి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు.

భవిష్యత్తులో ఆరోగ్య మిత్రాలను ఆరోగ్యశ్రీ ట్రస్టు ఉద్యోగులుగా గుర్తించాలని,ఖాళీలన్నిటిని భర్తీ చేయాలని,విధి నిర్వహణలో మరణించిన ఆరోగ్య మిత్రాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా కల్పించాలని ఈ సందర్భంగా యూనియన్ తరపున మంత్రి కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుమార్,ఉపాధ్యక్షులు సుమన్,రాష్ట్ర కమిటీ సభ్యులు కిషోర్,ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు రత్నం,నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగరాజు పాల్గొనడం జరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -