Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యువత వ్యసనాల బారిన పడొద్దు 

యువత వ్యసనాల బారిన పడొద్దు 

- Advertisement -

బాల్కొండ ఎస్ ఐ శైలేందర్ 
నవతెలంగాణ- బాల్కొండ 

యువత వ్యసనాలకు బానిస కావద్దని బాల్కొండ ఎస్ ఐ శైలేందర్ విద్యార్థులకు సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఫేర్వెల్ పార్టీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఐ శైలేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు వ్యసనాలకు బానిస కాకుండా తమ చదువుపై దృష్టి పెట్టాలని అన్నారు. అనంతరం కళాశాల ప్రిన్సిపల్ రజియుద్దీన్ అస్లాం మాట్లాడుతూ విద్యార్థులు రానున్న పరీక్షలకు ఇప్పటినుంచే కష్టపడి చదివి కళాశాలను జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలవాలని కోరారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి ప్రిన్సిపల్ శ్రీనాథ్, కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -