Friday, January 30, 2026
E-PAPER
Homeక్రైమ్గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని డ్రైవర్ మృతి

- Advertisement -

నవతెలంగాణ – ఉప్పునుంతల 
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం సూర్య తండా గ్రామ పరిధిలో కట్టంగూర్ గ్రామానికి చెందిన కారింగు శ్రీకాంత్ (23) అనే డ్రైవర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటన జనవరి 30 ఉదయం హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై సూర్య తండ గ్రామ శివారులో జరిగింది. అశోక్ లేలాండ్ వాహనాన్ని రోడ్ పక్కన ఆపి దిగుతున్న సమయంలో వెనుక నుంచి గుర్తుతెలియని వాహనం అతివేగంగా వచ్చి ఢీకొనడంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన తర్వాత వాహన డ్రైవర్ పారిపోయినట్లు సమాచారం. మృతుడి తల్లి సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -