– డాక్టర్ అంకం శ్రీనివాస్
నవతెలంగాణ – ఆలేరు రూరల్
ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఆలేరు మండల గ్రామీణ వైద్య మండల అధ్యక్షులు డాక్టర్ అంకం శ్రీనివాస్ తండ్రి, దివంగత డాక్టర్ అంకం పెంటయ్య జ్ఞాపకార్థం సుమంత్ కంటి హాస్పటల్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు,అద్దాలు,మందులు అందించడమే కాకుండా అవసరమైన వారికి ఉచిత కంటి ఆపరేషన్లు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సేవలకు సహకరించిన సుమంత్ కంటి హాస్పటల్ యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శిబిరంలో భాగంగా ఉచిత రక్త పరీక్షలు, షుగర్ పరీక్షలు, బీపీ పరీక్షలు నిర్వహించారు. గ్రామంలోని పేద కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బెదరబోయిన యాకమ్మ వెంకటేష్, డాక్టర్ కృష్ణమూర్తి, నరేందర్ గౌడ్, శ్రీకాంత్, అంకం రోజా తదితరులు పాల్గొన్నారు.



