Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

- Advertisement -

-కామ్రేడ్ భూపాల్.. సి ఐ టి యు రాష్ట్ర ఉపాధ్యక్షులు
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 

ఫిబ్రవరి 12 న జరిగే దేశవ్యాప్త కార్మిక సమ్మెను జయప్రదం చేయాలని సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కామ్రేడ్ భూపాల్  కార్మికులకు పిలుపునిచ్చారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం పెద్ద కందుకూరు ప్రీమియర్ ఎక్స్ ప్లొసివ్స్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో  ప్రీమియర్ పరిశ్రమ వద్ద సమ్మె జయప్రదం కోసం గేట్ మీటింగ్ సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా  కామ్రేడ్ భూపాల్  మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుండి కార్మికుల హక్కులను కాలరాస్తూ 29 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని విమర్శించారు. కార్మికుల ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పెంచుతూ, కార్మికులు యూనియన్ ఏర్పాటు చేసుకునే హక్కును, సమ్మె చేసే హక్కును ప్రశ్నార్థకం చేస్తూ లేబర్ కోడ్ లను తీసుకువచ్చారని, భవిష్యత్ లో కార్మికులను పర్మినెంట్ అనే మాట ఉండకుండా కాంట్రాక్ట్ విధానం తీసుకువచ్చారని, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్ విధానం ముందుకు తెచ్చారని, లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12న జరిగే సమ్మెలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని సమ్మె జయప్రదం చేయాలని పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు సుబ్బూరు సత్యనారాయణ, ప్రీమియర్ యూనియన్ జనరల్ సెక్రటరీ సి హెచ్ రమేష్, టి ఎన్ టి యు సి రాష్ట్ర నాయకులు రేగు బాలనర్సయ్య, సిఐటియు నాయకులు పుప్పాల గణేష్, బి వెంకటయ్య, జె వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీను,గంగయ్య, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -