Friday, January 30, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అంగన్వాడీ టీచర్ పనితీరుపై హర్షం

అంగన్వాడీ టీచర్ పనితీరుపై హర్షం

- Advertisement -

నవతెలంగాణ- నెల్లికుదురు 
మండలంలోని వస్త్రం తండా గ్రామపంచాయతీ శివారులో లాలుతాండలో అంగన్వాడి సెంటర్లోని పిల్లలు నా పిల్లలే అంటూ తానే అమ్మనై కమ్మనైన వంటలతో పాటు మూగబోయిన పిల్లలకు పదాలు నేర్పించడంలో అంగన్వాడి టీచర్ తోట్ల వెంకటమ్మ చేస్తున్న కృషి ఎంతో గొప్పదని తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం అంగన్వాడి సెంటర్ లోని నిరుపేద కుటుంబానికి చెందిన ఓ చిన్నారి కి ప్రత్యేకంగా టైం కేటాయించి తన ఆరోగ్యం, విద్యాభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

మహబూబాద్ జిల్లాలో తొరూర్ ప్రాజెక్టు నెల్లికుదురు మండలంలో వస్రంతండ జిపిలో లాలు తండా అంగనవాడి కేంద్రం లో అంగన్వాడి టీచర్ తొట్ల వెంకటలక్ష్మి 25 సంవత్సరాల నుండి అక్కడ అంగన్వాడి సెంటర్లో విధులు నిర్వహిస్తుందని గ్రామస్తులు తెలిపారు. గుగులోతు సురేష్ అనూష  దంపతులకు ఇద్దరు పాపలు ఒక బాబు ఉండగా రెండో అమ్మాయి పాప కు మాటలు రావట్లేదు. వారిది చాలా పేదరికం కావున కనీసం దావకానకు తీసుకుపోలేనంత పేదరికం లో ఉన్నారని అన్నారు. హైదరాబాదు నుండి డాక్టరు మన నెల్లికుదురు ప్రభుత్వ దావకానకు కి వస్తున్నారని తెలిసిన వెంటనే అన్ని రకాల వైద్యాo గురించి చూస్తాడు అని నాకు తెలియగానే వెంటనే  నేను అంగన్వాడీ కేంద్రంలోని మాటల రాణి ఆ పాప తండ్రిని తీసుకొని ఆ డాక్టర్ కు చూపించగా ఈ పాప కు మాటలు రావాలంటే బాగా మాట్లాడించడనికి బాగా ప్రయత్నం చేయాలని సంబంధిత వైద్యాధికారి తెలిపారు.

ఆ రోజు నుండి ఆమెపై ప్రత్యేక దృష్టి పెట్టి గత ఆరు నెలల నుండి ఆ పాపను అంగన్వాడికి పంపిస్తున్నారు. ఈ క్రమంలో ఒకరోజు సిడిపిఓ కమలాదేవి లాలు తండా అంగనవాడిని తనిఖీ చేయగా ఆ పాపను మందలించారు. ఆ పాపకు మాటలు రావట్లేదని మేడంతో అనడంతో అక్కడ చాలా సేపు దాకా పాప గురించి నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కచ్చితంగా పాపకి మాటలు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి.. ఆమెను బాగా మాట్లాడడానికి ప్రయత్నం చేయాలని చెప్పారు. వారి మాటలతో ఇంకా కాస్త బాధ్యత పెరిగిందని ఆమె తెలిపింది. ఆ పాపకు మాటలు వచ్చేంతవరకు ఆ మాట ప్రకారమే ప్రయత్నం చేసామని తెలిపారు.

ఇప్పుడు ఆ పాపకి మాటలు వస్తున్నాయి. ఏ బి సి డి అమ్మ నాన్న వాళ్ళ భాషలో బా. యా అని చెప్తుంది అని తెలిపారు. నాకు ఎంతో సంతోషకరంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. పాప విషయంలో గత నాలుగు సంవత్సరాల నుండి నాకు ఆయా లేకున్నా అంగన్వాడి  సెంటర్ ను నడిపిస్తున్నానని అన్నారు. ప్రతిరోజు ఆ పాప వాళ్ళ ఇంటికి వెళ్లి ఆ పాపను ఎత్తుకొని వస్తున్నానని తెలిపారు. చక్కగా పాప ఇప్పుడు మాట్లాడుతోందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -