Saturday, January 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ 

నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జనరల్ అబ్జర్వర్ 

- Advertisement -

నవతెలంగాణ- ఆర్మూర్  
మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకులు సీహెచ్. సత్యనారాయణ రెడ్డి నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని శుక్రవారం పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ను సందర్శించి, నామినేషన్ల స్వీకరణ తీరును క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. నిబంధనలకు అనుగుణంగా స్వీకరణ ప్రక్రియ జరుగుతోందా అని నిశిత పరిశీలన చేశారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, హెల్ప్ డెస్క్ లను పరిశీలించారు. నామినేషన్ల స్క్రూటినీ, ఉపసంహరణ, పోలింగ్, కౌంటింగ్ ఏర్పాట్ల సన్నద్ధతపై అధికారులతో చర్చించి, బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల మెటీరియల్ గురించి అడిగి తెలుసుకున్నారు. టీ పోల్ యాప్ లో ఎన్నికల రిపోర్టులు అప్లోడ్ చేస్తున్న వైనాన్ని పరిశీలించారు. అబ్జర్వర్ వెంట  సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, మున్సిపల్ కమిషనర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -