Saturday, January 31, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబీజేపీ పేదలను పట్టించుకోదు: టీపీసీసీ చీఫ్

బీజేపీ పేదలను పట్టించుకోదు: టీపీసీసీ చీఫ్

- Advertisement -

కార్పొరేట్లకు ఊడిగం చేస్తుంది
ఉపాధి హామీ చట్టంపై బీజేపీ మొండి వైఖరి 
నవతెలంగాణ – ఆలేరు రూరల్

మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం వల్ల దేశంలోని పేదలు రెండు పూటల భోజనం చేసే పరిస్థితి వచ్చిందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్  అన్నారు. ఆలేరు మండలం మందన పల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పేరు మార్పుకు నిరసనగా పెద్ద ఎత్తున పేద ప్రజలతో నిరసన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని మార్చే కుట్రలు చేస్తోందన్నారు. 2019-20 సంవత్సరంలో ఆర్థిక సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతదేశంలో సంక్షేమం రాకపోవడానికి కారణం ఉపాధి హామీ పథకమే అన్నారు.

ప్రజల కొనుగోలు శక్తి పెంచే ఇలాంటి పథకాల వల్ల పేదలు అభివృద్ధి చెందుతారు అన్నారు. మోడీ ప్రభుత్వం బిజెపి పాలనలో కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహారిస్తుందన్నారు. ఉపాధి హామీ చట్టం నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలపై భారాలు మోపి, పని దినాలను తగ్గించే ప్రయత్నం చేస్తుందన్నారు. దీనివల్ల గ్రామాల్లో ఉన్న పేదలు దిగువ స్థాయి రైతులు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్ పర్సన్ బండ్రు శోభారాణి,టిపీసీసీ ప్రధాన కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ సిరిమర్తి రేణుక నరసయ్య,మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి,మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ,ఆలేరు మండల పార్టీ అధ్యక్షులు కొండ్రోజు వెంకటేశ్వర రాజు మరియు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -