- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సీపీఐ(ఎం) అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. కామారెడ్డి పట్టణంలోని 7వ వార్డులో కందూరి రేణుక, 8వ వార్డులో కందూరి చంద్రశేఖర్, 27వ వార్డులో తోట అలేఖ్య, ముదాం అరుణ్ లు సీపీఐ(ఎం) అభ్యర్థులుగా నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీపీఐ(ఎం) ప్రజా పోరాటాలను ఊపిరిగా తీసుకొని ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడే పార్టీ అని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేసే సీపీఐ(ఎం)కు ప్రజలు మద్దతు ఇచ్చి, మూడు వార్డులలో అభ్యర్థులను విజయవంతంగా గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు.
- Advertisement -



